Back to Telugu Language Pack Telugu Language Pack
Transcend Store Loader Image
Thumbnail Image of భాగవత కథలు

భాగవత కథలు (Bhagavatha Kathalu)

Author: కథల రూపము వైష్ణవాంఘ్రిసేవక దాసు

Description

అంతర్జాతీయ కృష్ణుచైతన్యసంఘ సంస్థాపకాచార్యులైనట్టి కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు తమ గురుదేవుని ఆజ్ఞ మేరకు కృష్ణభక్తిని పాశ్చాత్యదేశాలలో ప్రచారము చేయడానికి సంకల్పించినపుడు శ్రీల వ్యాసదేవునిచే రచించబడిన శ్రీమద్భాగవతమునే దివ్యసాధనముగా ఎంచుకున్నారు. భాగవతంలోని పద్దెనిమిదివేల శ్లోకాలకు ప్రతిపదార్థము, తాత్పర్యము, సమగ్రమైన భాష్యమును ఆంగ్లభాషలో రచించే బృహత్కార్యాన్ని చేపట్టి, సాధించి గుర్వాజ్ఞను ఆయన నెరవేర్చారు. ఆ సమగ్ర భాగవత వ్యాఖ్యానము ఇపుడు పద్దెనిమిది సంపుటాలలో తెలుగుభాషతో సహా అనేక ప్రపంచ భాషలలో లభిస్తున్నది. వ్యాసవిరచితమైన శ్రీమద్భాగవతములో నిక్షిప్తమైనట్టి అనేకమైన ఆధ్యాత్మిక రహస్యాలు శ్రీల ప్రభుపాదులవారి భక్తివేదాంతభాష్యము ద్వారా వెల్లడి అయినాయి. మూల సంస్కృత భాగవతము ఒక రహస్యపురాణము. శ్రీల వ్యాసదేవుడు దానిని తన పరిపక్వావస్థలో రచించారు. అయితే తెలుగువారిలో వ్యాసభాగవతము విస్తృతంగా ప్రచారం కాకపోవడం వలన దానిలోని ఎన్నో రహస్యాలు గుప్తంగా ఉండిపోయాయి. జనులకు తెలియకుండ రహస్యంగా ఉండిపోయిన విషయము కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది. శ్రీకృష్ణుడు సకలావతారాలను ధరించినట్టి అవతారి అని తెలియజేయడమే శ్రీమద్భాగవత ఉద్దేశ్యము. పద్దెనిమిది సంపుటాల రూపంలో ఉన్నట్టి సమగ్రమైన భక్తివేదాంత భాష్యము ద్వారా తెలియబడే ఆ రహస్యాలను అతిత్వరగా తెలిసికొనే అవకాశము తెలుగు ప్రజలకు అందించాలనే ఈ భాగవత కథలు అనే పుస్తకాన్ని ప్రచురించడము జరిగింది. ఈ పుస్తకమును చదవడము ద్వారా వ్యాసభాగవత సారము మీకు నిశ్చయంగా అర్థమౌతుంది. దీనిని చదివిన తరువాత మరింత రసాస్వాదనకు, తత్త్వావగాహనకు పద్దెనిమిది సంపుటాల భక్తివేదాంత భాష్యమును పాఠకులు చదవాలి. ఆ విధంగా నిరంతర భాగవత పఠనంలో మానవజన్మ సార్థకమౌతుంది.

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.

Your IP Address: 216.73.216.202 Server IP Address: 169.254.130.2